ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ మెడికల్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి దివ్యాంగ (పీడబ్ల్యూబీడీ) అభ్యర్థులు అక్టోబరు 28న ఉదయం 10 గంటలకు విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఎదుట హాజరు కావాలని రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుధీర్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత సాధించిన 11 మంది అభ్యర్థుల ప్రాధాన్యక్రమాన్ని వర్సిటీ వెల్లడించింది. అభ్యర్థులు తమ వైకల్య పత్రాలతో పాటు పాస్‌పోర్టు సైజు ఫొటోతో రావాలని సూచించారు.
