టీజీపీఎస్సీ (TGPSC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పరీక్ష తేదీని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6న జరగాల్సిన ఈ పరీక్షను, ఒక రోజు ఆలస్యంగా నవంబర్ 7న నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అదే రోజున (నవంబరు 6న) స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC JE) పరీక్ష కూడా ఉండటంతో, చాలామంది అభ్యర్థులు ఒకే తేదీలో రెండు ముఖ్యమైన పరీక్షలు రాయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అభ్యర్థుల ఇబ్బందిని గుర్తించిన కమిషన్, వారి విజ్ఞప్తిని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. ఒకే రోజున ఈ రెండు పరీక్షలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ సా. 5 గంటలలోపు అవసరమైన సర్టిఫికెట్లు మెయిల్ చేయాలని సూచించింది.
