కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న బొంపల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును అందుకున్నారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ అవార్డును అందజేశారు. తెలంగాణ నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక మహిళగా భవాని నిలిచారు. ఆమె కృషిని గుర్తించి ఎస్ఈఆర్టీ (తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి) ట్రయల్ బ్లేజర్స్లో ప్రచురించింది. వినూత్న కృత్యాధార పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్న ఆమెకు జాతియ స్థాయిలో గుర్తింపు దక్కడం జిల్లాకు గర్వకారణమని పలువురు అభినందించారు.
