తెలంగాణ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో జాతీయ ఆయుష్ మిషన్ (National AYUSH Mission) కింద వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయుష్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్‌ల నిర్వహణ కోసం మొత్తం 8 పోస్టులను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 8
పోస్టుల వివరాలు:
- ఆయుష్ డాక్టర్ (పీజీ అర్హతతో) – 1
- ఆయుష్ మెడికల్ ఆఫీసర్ – 2
- డైటీషియన్ – 1
- సైకోసోషల్ కౌన్సెలర్ – 1
- యోగా ప్రొఫెషనల్ – 1
- మల్టీ పర్పస్ వర్కర్ (MPW) – 2
విద్యార్హతలు: ఆయుష్ డాక్టర్ పోస్టుకు ఆయుర్వేదం, యునాని, హోమియోపతి లేదా నేచురోపతిలో పీజీ డిగ్రీ ఉండాలి. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు ఏడాది తప్పనిసరి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. డైటీషియన్ పోస్టుకు బీఎస్సీ న్యూట్రిషన్, సైకోసోషల్ కౌన్సెలర్ పోస్టుకు సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ (MSW), యోగా ప్రొఫెషనల్ పోస్టుకు నేచురోపతిలో డిగ్రీ లేదా డిప్లొమా అవసరం. మల్టీ పర్పస్ వర్కర్ పోస్టుకు ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు సైకిల్ లేదా మోటార్ సైకిల్ నడపడం తెలిసి ఉండాలి.
వయోపరిమితి: 01-07-2026 నాటికి 18 నుంచి 44 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.
జీతం: ఆయుష్ డాక్టర్‌కు నెలకు రూ.60,000, ఆయుష్ మెడికల్ ఆఫీసర్‌కు రూ.40,000, డైటీషియన్‌కు రూ.20,000, యోగా ప్రొఫెషనల్‌కు రూ.28,000, మల్టీ పర్పస్ వర్కర్‌కు రూ.15,000 చెల్లిస్తారు. సైకోసోషల్ కౌన్సెలర్‌కు ఒక్కో సెషన్‌కు రూ.500 చొప్పున, ఏడాదికి కనీసం 200 సందర్శనల ప్రాతిపదికన చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆయుష్ డాక్టర్, మెడికల్ ఆఫీసర్, డైటీషియన్, సైకోసోషల్ కౌన్సెలర్, యోగా ప్రొఫెషనల్ పోస్టులకు అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయస్సుకు కేటాయించిన వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు. మల్టీ పర్పస్ వర్కర్ పోస్టుకు రాత పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
దరఖాస్తు విధానం: సంగారెడ్డి జిల్లా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాల స్వీయ ధ్రువీకరించిన ప్రతులను జతచేయాలి. దరఖాస్తును స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమర్పించవచ్చు.
దరఖాస్తు చిరునామా: యూపీహెచ్సీ, ఇందిరా నగర్ కాలనీ, రైస్ గోడౌన్ దగ్గర, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, సంగారెడ్డి హెచ్‌క్యూ – 502001, తెలంగాణ.
దరఖాస్తు తేదీలు: 12-10-2026 నుంచి 22-10-2026 వరకు, పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గడువు తర్వాత అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
అర్హతలు ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనలు పరిశీలించి, అవసరమైన ధ్రువపత్రాలతో గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
official website
official notification
