ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా తరచూ జాబ్ మేళాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, Osmania University – University Employment Information & Guidance Bureau (UEI & GB) కలిసి ఆగస్టు 19, 2025న హైదరాబాద్‌లో మెగా Job Mela ను నిర్వహిస్తున్నాయి.
జాబ్ మేళా ముఖ్య వివరాలు
- తేదీ: ఆగస్టు 19, 2025
- స్థలం: ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
- ముఖ్య సంస్థ: మిత్రా అరీనా ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్
- భర్తీ చేయబోయే పోస్టులు: Senior Relationship Manager – 40 ఖాళీలు
అర్హత & వయోపరిమితి
- అభ్యర్థులు పురుషులు లేదా మహిళలు కావచ్చు
- వయస్సు: 18 నుండి 30 సంవత్సరాల మధ్య
- విద్యార్హత: కనీసం ఇంటర్మీడియట్/డిగ్రీ పాస్ (సంబంధిత సర్టిఫికేట్లు తప్పనిసరిగా తీసుకురావాలి)
జీతం ఎంత ఉంటుంది
ఎంపికైన వారికి నెలకు ₹15,000 వరకు జీతం ఉంటుంది
ఈ జాబ్ మేళాకు ఎలా హాజరు అవ్వాలి
- ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా
- విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు
- ఆధార్/ఐడీ ప్రూఫ్
తో జాబ్ మేళాకు నేరుగా హాజరు కావాలి.
ముఖ్య సూచనలు
- అర్హత కలిగిన అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి
- ఎటువంటి అప్లికేషన్ ఫీజు అవసరం లేదు
- ఎంపికైన వారికి వెంటనే అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వబడుతుంది