ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (APCOB) విజయవాడలో మేనేజర్ స్కేల్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 38 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగష్టు 28, 2025 నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. పూర్తి వివరాల కోసం కింద ఉన్న ఆర్టికల్ని చదవండి.
నోటిఫికేషన్లో ముఖ్యమైన వివరాలు
| సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (APCOB) |
|---|---|
| ఉద్యోగం పేరు | మేనేజర్ స్కేల్ & స్టాఫ్ అసిస్టెంట్ |
| మొత్తం ఖాళీలు | 38 |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 28-08-2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 10-09-2025 |
| అధికారిక వెబ్సైట్ | www.apcob.org |
ఈ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు నిర్దిష్ట విద్యా అర్హతలను కలిగి ఉండాలి. పోస్టుల వారీగా అర్హతలు కింద ఇవ్వబడ్డాయి.
- మేనేజర్ స్కేల్:
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్లో 60% మార్కులు సాధించి ఉండాలి లేదా కామర్స్ గ్రాడ్యుయేట్ అయితే 55% మార్కులు సరిపోతాయి.
- ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ వంటి విభాగాలలో పీజీ లేదా IIBF, ముంబై నుండి డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
- స్టాఫ్ అసిస్టెంట్:
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- ఇంగ్లీష్ మరియు స్థానిక భాష (తెలుగు)లో ప్రావీణ్యం తప్పనిసరి.
- కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
APCOB ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వారీగా మరియు కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు కింద పట్టికలో చూడవచ్చు.
పోస్టుల వారీగా ఖాళీలు:
- మేనేజర్ స్కేల్: 25
- స్టాఫ్ అసిస్టెంట్: 13
వయస్సు పరిమితి వివరాలు
అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిజర్వ్డ్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- SC/ST: 5 సంవత్సరాలు
- BC: 3 సంవత్సరాలు
- దివ్యాంగులు (జనరల్): 10 సంవత్సరాలు
- దివ్యాంగులు (SC/ST): 15 సంవత్సరాలు
- దివ్యాంగులు (BC): 13 సంవత్సరాలు
అప్లై చేసే వారికి అవసరమైన ఫీజు వివరాలు
అభ్యర్థులు దరఖాస్తు ఫీజును ఆన్లైన్ విధానంలో (డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI) చెల్లించాలి.
- SC/ST/PWBD/మాజీ సైనికులు: రూ. 590/-
- OC/EWS/BC: రూ. 826/-
ఈ ఉద్యోగంలో లభించే జీతం
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతంతో పాటు ఇతర భత్యాలు కూడా ఉంటాయి.
- మేనేజర్ స్కేల్: రూ. 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920
- స్టాఫ్ అసిస్టెంట్: రూ. 24050 – 1340/3-28070- 1650/3 – 33020 – 2000/4- 41020 – 2340/7 -57400-4400/1- 61800- 2680/1- 64480
ఆన్లైన్ దరఖాస్తు చేసే విధానం
అర్హులైన అభ్యర్థులు APCOB అధికారిక వెబ్సైట్ www.apcob.org ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు లింక్ అందుబాటులో ఉంది.
| District | Notification PDF |
| Manager Scale | Click to Download |
| Staff Assistant | Click to Download |