నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జైళ్ల శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కడప, నెల్లూరు సెంట్రల్ జైళ్లలో ఏర్పాటు చేస్తున్న డీ-అడిక్షన్ సెంటర్లలో తాత్కాలిక పద్ధతిలో వివిధ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ, నర్సింగ్, 8వ తరగతి పాసైన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం కింద ఉన్న ఆర్టికల్‌ని చదవండి.
నోటిఫికేషన్‌లో ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జైళ్ల శాఖ, గుంటూరు రేంజ్ |
---|---|
ఉద్యోగం పేరు | ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సెలర్, నర్స్, వార్డ్ బాయ్ మరియు ఇతర పోస్టులు |
మొత్తం ఖాళీలు | 14 (కడప – 07, నెల్లూరు – 07) |
జీతం | నెలకు ₹10,000/- నుండి ₹30,000/- వరకు |
ప్రారంభ తేదీ | 21-08-2025 |
చివరి తేదీ | 10-09-2025 |
అధికారిక ఇమెయిల్ | digprisonsgnt@gmail.com |
ఈ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్: డిగ్రీ + 3 సంవత్సరాల అనుభవం (డ్రగ్ నిరోధక రంగంలో) + కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
అకౌంటెంట్ కమ్ క్లర్క్: డిగ్రీ + అకౌంట్స్ నాలెడ్జ్ + కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
కౌన్సెలర్/సోషల్ వర్కర్: సోషల్ సైన్స్/సోషల్ వర్క్/సైకాలజీ డిగ్రీ + 1-2 సంవత్సరాల అనుభవం + తెలుగు, ఇంగ్లీష్ తెలిసి ఉండాలి.
నర్సు (పురుషుడు): GNM లేదా B.Sc నర్సింగ్ డిగ్రీ ఉండాలి.
వార్డ్ బాయ్: కనీసం 8వ తరగతి పాస్ + ఆసుపత్రి/హెల్త్ సెంటర్‌లో అనుభవం ఉండాలి.
పీర్ ఎడ్యుకేటర్: చదవడం–రాయడం వచ్చి ఉండాలి + డ్రగ్స్ నుండి కోలుకుని 1-2 సంవత్సరాలు గడిచినవారు + ఇతరులకు అవగాహన కల్పించే నైపుణ్యం ఉండాలి.
ఈ ఉద్యోగంలో ఉన్న ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ విడుదల చేసిన ఈ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 తాత్కాలిక పోస్టులను భర్తీ చేస్తున్నారు
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్: 02 (కడప – 01, నెల్లూరు – 01)
- అకౌంటెంట్ కమ్ క్లర్క్: 02 (కడప – 01, నెల్లూరు – 01)
- కౌన్సెలర్/సోషల్ వర్కర్: 04 (కడప – 02, నెల్లూరు – 02)
- నర్సు (పురుషుడు): 02 (కడప – 01, నెల్లూరు – 01)
- వార్డ్ బాయ్: 02 (కడప – 01, నెల్లూరు – 01)
- పీర్ ఎడ్యుకేటర్: 02 (కడప – 01, నెల్లూరు – 01)
వయస్సు పరిమితి వివరాలు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఉండాలి.
- కనీస వయస్సు: 21 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
నోటిఫికేషన్‌లో SC, ST, OBC వంటి ఇతర వర్గాలకు వయస్సు సడలింపుల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
అప్లై చేసే వారికి అవసరమైన ఫీజు వివరాలు
ఈ AP Jobs కు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఈ ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపిక జరిగే విధానం
దరఖాస్తు చేసిన అభ్యర్థులను వారి విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా ముందుగా షార్ట్‌లిస్ట్ చేసే అవకాశం ఉంది.
ఈ ఉద్యోగంలో లభించే జీతం మరియు ఇతర ప్రయోజనాలు
ఈ పోస్టులు తాత్కాలిక ఉద్యోగాలు. ఎంపికైన వారికి ప్రతి నెలా గౌరవ వేతనం ఇవ్వబడుతుంది. ఇది పోస్టు ఆధారంగా వేర్వేరుగా ఉంటుంది.
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్: ₹30,000/- నెలకు
- కౌన్సెలర్ / సోషల్ వర్కర్: ₹25,000/- నెలకు
- నర్సు (పురుషుడు): ₹20,000/- నెలకు
- వార్డ్ బాయ్: ₹20,000/- నెలకు
- అకౌంటెంట్ కమ్ క్లర్క్: ₹18,000/- నెలకు
- పీర్ ఎడ్యుకేటర్: ₹10,000/- నెలకు
ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ దరఖాస్తు చేసే విధానం
అర్హత ఉన్న అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన అప్లికేషన్ (CV) ను పోస్ట్ ద్వారా గానీ లేదా ఇమెయిల్ ద్వారా గానీ పంపించాలి. దరఖాస్తులు పంపవలసిన చిరునామా: O/o డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, గుంటూరు రేంజ్, తాడేపల్లి, కొల్లిస్ రెసిడెన్సీ, 7వ లేన్, రాజ రాజేశ్వరి నగర్, ఆశ్రమ రోడ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా – 522 501. ఇమెయిల్ ద్వారా పంపేవారు digprisonsgnt@gmail.com కు పంపాలి
పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ PDF లింక్ చూడండి. | |
అధికారిక ఇమెయిల్ | digprisonsgnt@gmail.com |
అధికారిక నోటిఫికేషన్ PDF | Download PDF |