NaaJob WhatsApp Channel Join WhatsApp

ఏఆర్‌సీఐ హైదరాబాద్‌లో అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు

825ac3a8 a842 4904 a1a7 87e6a77744ee

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన ఈ స్వయంప్రతిపత్తి పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో మొత్తం 29 పోస్టులు ఉన్నాయి. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సైంటిస్ట్, ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సీ అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

పోస్టు పేరు ఖాళీలు
సైంటిస్ట్ ‘B’ (R&D) 04
ఆఫీసర్ ‘B’ (ఫైనాన్స్ & అకౌంట్స్) 01
టెక్నికల్ అసిస్టెంట్ ‘A’ 07
అసిస్టెంట్ ‘A’ 06
టెక్నీషియన్ ‘A’ 09
డ్రైవర్ ‘A’ 02
మొత్తం 29

విద్యార్హతలు

1. సైంటిస్ట్ ‘B’ (4 పోస్టులు): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెటీరియల్స్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ/బీటెక్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పరిశోధన అనుభవం అదనపు అర్హతలుగా పరిగణిస్తారు.

2. ఆఫీసర్ ‘B’ – ఫైనాన్స్ & అకౌంట్స్ (1 పోస్టు): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మంచి అకడమిక్ రికార్డుతో బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హత ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో పనిచేస్తున్న అర్హులైన అధికారులు డిప్యుటేషన్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పే లెవల్‌లో నిర్ణీత సర్వీస్ అనుభవం, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పర్యవేక్షణ అనుభవం అవసరం.

3. టెక్నికల్ అసిస్టెంట్ ‘A’ (7 పోస్టులు): కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా కలిగిన ఫిజికల్ సైన్సెస్‌లో బీఎస్సీ లేదా మెటలర్జీ/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల ఫుల్‌టైమ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టుకు పేర్కొన్న అర్హతల కంటే ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులు కారు.

4. అసిస్టెంట్ ‘A’ (6 పోస్టులు): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతోపాటు సంబంధిత అడ్మినిస్ట్రేషన్, ఎస్టాబ్లిష్‌మెంట్, హెచ్ఆర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, పర్చేజ్ అండ్ ఇన్వెంటరీ తదితర విభాగాల్లో మూడేళ్ల అనుభవం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఈ-ఆఫీస్, ఈఆర్‌పీ అప్లికేషన్లపై అవగాహన అవసరం.

5. టెక్నీషియన్ ‘A’ (9 పోస్టులు): పదో తరగతి/ఎస్ఎస్సీ ఉత్తీర్ణతతోపాటు ఫిట్టర్, టర్నర్ లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి రెండేళ్ల ఫుల్‌టైమ్ ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఇండస్ట్రీ లేదా ఆర్ అండ్ డీ ల్యాబొరేటరీల్లో మూడేళ్ల సాంకేతిక అనుభవం అవసరం. అర్హతకు మించి ఉన్నత విద్యార్హతలు కలిగినవారు ఈ పోస్టుకు పరిగణించబడరు.

6. డ్రైవర్ ‘A’ (2 పోస్టులు): పదో తరగతి/ఎస్ఎస్సీ ఉత్తీర్ణతతోపాటు లైట్, హెవీ వెహికల్స్ నడిపేందుకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంపై అవగాహన, లైట్ వెహికల్స్ నడపడంలో కనీసం మూడేళ్లు, హెవీ వెహికల్స్ నడపడంలో కనీసం ఆరేళ్ల అనుభవం అవసరం.

వయోపరిమితి

  • సైంటిస్ట్ ‘B’ – గరిష్ఠంగా 30 ఏళ్లు.
  • ఆఫీసర్ ‘B’ – గరిష్ఠంగా 56 ఏళ్లు.
  • టెక్నికల్ అసిస్టెంట్ ‘A’ – గరిష్ఠంగా 30 ఏళ్లు.
  • అసిస్టెంట్ ‘A’ – గరిష్ఠంగా 28 ఏళ్లు.
  • టెక్నీషియన్ ‘A’ – గరిష్ఠంగా 28 ఏళ్లు.
  • డ్రైవర్ ‘A’ – గరిష్ఠంగా 27 ఏళ్లు.

జీతభత్యాలు

పోస్టు నెలవారీ మొత్తం వేతనం (సుమారు)
సైంటిస్ట్ ‘B’ రూ.1,18,110
ఆఫీసర్ ‘B’ రూ.1,18,110
టెక్నికల్ అసిస్టెంట్ ‘A’ రూ.73,020
అసిస్టెంట్ ‘A’ రూ.61,240
టెక్నీషియన్ ‘A’ రూ.54,210
డ్రైవర్ ‘A’ రూ.39,970

7వ కేంద్ర వేతన సంఘం పే లెవల్స్ ప్రకారం జీతాలు చెల్లిస్తారు. బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ తదితరాలు వర్తించే నిబంధనల ప్రకారం ఉంటాయి. ఎన్‌పీఎస్, గ్రాట్యుటీ, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, ఎల్‌టీసీ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.

ఎంపిక విధానం

అభ్యర్థుల దరఖాస్తులను విద్యార్హతలు, అనుభవం తదితర అంశాల ఆధారంగా ప్రాథమికంగా పరిశీలిస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు పోస్టును బట్టి కంప్యూటర్ ఆధారిత పోటీ రాత పరీక్ష (CWE), ట్రేడ్/స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

  • సైంటిస్ట్ ‘B’: 100 ప్రశ్నలు, 300 మార్కులు, 3 గంటల పరీక్ష. తప్పు సమాధానానికి ఒక మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. రాత పరీక్షకు 50%, ఇంటర్వ్యూకు 50% వెయిటేజీతో తుది ఎంపిక చేస్తారు.
  • ఆఫీసర్ ‘B’: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు 10–15 నిమిషాల ప్రెజెంటేషన్, అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ పనితీరు ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  • టెక్నికల్ అసిస్టెంట్ ‘A’: 100 ప్రశ్నలు, 200 మార్కులు, 3 గంటల పరీక్ష. అనంతరం ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఉంటుంది. తుది ఎంపిక రాత పరీక్ష మార్కుల ఆధారంగా ఉంటుంది.
  • అసిస్టెంట్ ‘A’: 125 ప్రశ్నలు, 200 మార్కులు, 3 గంటల పరీక్ష. అనంతరం స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. తుది ఎంపిక రాత పరీక్ష మార్కుల ఆధారంగా ఉంటుంది.
  • టెక్నీషియన్ ‘A’: 100 ప్రశ్నలు, 200 మార్కులు, 3 గంటల పరీక్ష. అనంతరం సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో స్కిల్ టెస్ట్ ఉంటుంది. తుది ఎంపిక రాత పరీక్ష మార్కుల ఆధారంగా ఉంటుంది.
  • డ్రైవర్ ‘A’: 65 ప్రశ్నలు, 100 మార్కులు, 2 గంటల పరీక్ష. అనంతరం స్కిల్, డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తారు. తుది ఎంపికలో రాత పరీక్షకు 40%, డ్రైవింగ్ టెస్ట్, రిపేర్ పనులకు 60% వెయిటేజీ ఉంటుంది.

టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రైవర్ పోస్టులకు సంబంధించిన స్కిల్/ట్రేడ్ టెస్టులు అర్హత సాధించాల్సిన పరీక్షలుగా ఉంటాయి. ఈ పరీక్షల్లో పొందిన మార్కులు తుది మెరిట్‌లో పరిగణించరు (డ్రైవర్ పోస్టుకు ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది).

దరఖాస్తు ఫీజు

కేటగిరీ సైంటిస్ట్ ‘B’, ఆఫీసర్ ‘B’ మిగిలిన పోస్టులు
జనరల్, ఓబీసీ రూ.600 రూ.500
ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, మహిళలు, మాజీ సైనికులు రూ.400 రూ.300

దరఖాస్తు ఫీజును యూపీఐ లేదా ఎన్ఈఎఫ్‌టీ/ఆర్‌టీజీఎస్ ద్వారా చెల్లించాలి. బ్యాంకు లావాదేవీ వివరాలు, ట్రాన్సాక్షన్ రసీదును ఆన్‌లైన్ దరఖాస్తుకు జత చేయాలి. ఫీజు తిరిగి చెల్లించబడదు.

దరఖాస్తు విధానం

  1. ARCI అధికారిక వెబ్‌సైట్ https://arci.res.in/careers/vacancies ను సందర్శించాలి.
  2. అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
  3. తగిన పోస్టును ఎంపిక చేసుకుని ఆన్‌లైన్ దరఖాస్తులో వివరాలు నమోదు చేయాలి.
  4. విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలను పూర్తిగా నమోదు చేయాలి.
  5. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా దరఖాస్తు ఫీజు చెల్లించి లావాదేవీ రసీదును జత చేయాలి.
  6. దరఖాస్తును పరిశీలించి చివరగా సబ్మిట్ చేయాలి.
  7. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు కాపీ, ఫీజు రసీదును భద్రపరచుకోవాలి.

ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. అసంపూర్ణ దరఖాస్తులు, ఫీజు వివరాలు లేదా రసీదు లేని దరఖాస్తులను తిరస్కరిస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21 నవంబర్ 2026
  • కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష: 23 డిసెంబర్ 2026
  • టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ట్రేడ్/స్కిల్ టెస్ట్: 23 జనవరి 2027
  • టెక్నీషియన్, డ్రైవర్ ట్రేడ్/స్కిల్ టెస్ట్: 24 జనవరి 2027

పరీక్షలు, ఇంటర్వ్యూలు, స్కిల్ టెస్టులకు హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది. ఆఫీసర్ ‘B’ ఇంటర్వ్యూ డిసెంబర్ 2026లో, సైంటిస్ట్ ‘B’ ఇంటర్వ్యూ జనవరి 2027లో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇవి తాత్కాలిక షెడ్యూల్ తేదీలు.

ముఖ్యమైన లింకులు

ARCI Hyderabad  Recruitment Notification 2026

Official Website

Scroll to Top