భారత ప్రభుత్వ మహారత్న సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID), అనుభవం ఉన్న నిపుణుల కోసం ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న పవర్‌గ్రిడ్ మరియు దాని అనుబంధ ప్రాజెక్టులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫీల్డ్ ఇంజనీర్ మరియు ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎలక్ట్రికల్, సివిల్, మరియు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ విభాగాలలో మొత్తం 1543 ఖాళీలు ఉన్నాయి. B.E/B.Tech లేదా డిప్లొమా పూర్తి చేసి, సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. పూర్తి వివరాల కోసం కింద ఉన్న ఆర్టికల్‌ని చదవండి
నోటిఫికేషన్లో ముఖ్యమైన వివరాలు
| సంస్థ పేరు | పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) |
|---|---|
| ఉద్యోగం పేరు | ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్వైజర్ |
| ఖాళీలు | 1543 |
| అర్హత | B.E/B.Tech/B.Sc (Engg.)/డిప్లొమా + 1 సంవత్సరం అనుభవం |
| జీతం | నెలకు ₹23,000 నుండి ₹30,000 వరకు (బేసిక్ పే) |
| చివరి తేదీ | 17 సెప్టెంబర్ 2025 |
| అధికారిక వెబ్సైట్ | powergrid.in |
ఈ ఉద్యోగానికి కావలసిన విద్యా అర్హతల వివరాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నిర్దిష్ట విద్యార్హతలు మరియు అనుభవం కలిగి ఉండాలి.
- ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్/సివిల్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 55% మార్కులతో ఫుల్ టైమ్ B.E/B.Tech/B.Sc (Engg.) పూర్తి చేసి ఉండాలి.
- ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డ్/ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 55% మార్కులతో ఫుల్ టైమ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. B.Tech/B.E వంటి ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు సూపర్వైజర్ పోస్టులకు అర్హులు కారు.
- అనుభవం: అన్ని పోస్టులకు విద్యార్హత తర్వాత సంబంధిత రంగంలో (ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ మొదలైనవి) కనీసం ఒక సంవత్సరం అనుభవం తప్పనిసరి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు పరిమితి వివరాలు
అన్ని పోస్టులకు దరఖాస్తుదారుల గరిష్ట వయస్సు సెప్టెంబర్ 17, 2025 నాటికి 29 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- OBC (NCL) అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
- PwBD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
మొత్తం 1543 ఖాళీలను వివిధ పోస్టులు మరియు విభాగాల వారీగా ఈ క్రింది విధంగా విభజించారు:
- ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 532
- ఫీల్డ్ ఇంజనీర్ (సివిల్): 198
- ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్): 535
- ఫీల్డ్ సూపర్వైజర్ (సివిల్): 193
- ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 85
అప్లై చేసే వారికి అవసరమైన ఫీజు వివరాలు
అభ్యర్థులు దరఖాస్తు ఫీజును ఆన్లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
- ఫీల్డ్ ఇంజనీర్: ₹400/-
- ఫీల్డ్ సూపర్వైజర్: ₹300/- SC/ST/PwBD/Ex-Servicemen కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది
ఈ ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపిక జరిగే విధానం
ఎంపిక ప్రక్రియ “పవర్‌గ్రిడ్ కామన్ FTE రాత పరీక్ష-2025” ద్వారా జరుగుతుంది.
- రాత పరీక్షలో టెక్నికల్ నాలెడ్జ్ (50 ప్రశ్నలు) మరియు ఆప్టిట్యూడ్ టెస్ట్ (25 ప్రశ్నలు) ఉంటాయి. పరీక్ష వ్యవధి 1 గంట. నెగెటివ్ మార్కింగ్ లేదు.
- ఫీల్డ్ ఇంజనీర్: రాత పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. తుది ఎంపిక కేవలం ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఉంటుంది.
- ఫీల్డ్ సూపర్వైజర్: రాత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే నేరుగా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.రాత పరీక్ష స్కోర్ కార్డ్ జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది
ఈ ఉద్యోగంలో లభించే జీతం మరియు ఇతర ప్రయోజనాలు
- పోస్టులు 24 నెలల కాంట్రాక్ట్.
- ఆకర్షణీయమైన వేతనం + DA, HRA, perks, మెడికల్, EPF, గ్రాట్యుటీ.
- ఫీల్డ్ ఇంజనీర్: ప్రారంభ బేసిక్ ₹30,000 (CTC ≈ ₹8.9L).
- ఫీల్డ్ సూపర్వైజర్: ప్రారంభ బేసిక్ ₹23,000 (CTC ≈ ₹6.8L).
ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ దరఖాస్తు చేసే పూర్తి విధానం
అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా Powergrid అధికారిక వెబ్సైట్ లో ‘Careers’ → ‘Job Opportunities’ సెక్షన్లోకి వెళ్ళి సంబంధిత నోటిఫికేషన్ ఎంచుకుని ఫారమ్ నింపాలి. దరఖాస్తు చేసుకునే ముందు ఇ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ మరియు అవసరమైన డాక్యుమెంట్లను (ఫోటో, సంతకం, పుట్టిన తేదీ, విద్యార్హత, అనుభవ, కుల ధృవీకరణ) స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. చివరగా ఫీజు చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయాలి. భవిష్యత్ కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది.
| పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ PDF లింక్ చూడండి. | |
| అధికారిక వెబ్సైట్ లింక్ | https://www.powergrid.in |
| అధికారిక నోటిఫికేషన్ PDF | Download PDF |