భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా ఆప్టెల్ లిమిటెడ్.. ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన 160 ప్రాజెక్ట్ టెక్నీషియన్, జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, వెల్ఫేర్ ఆఫీసర్, కన్సల్టెంట్ వంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 03 వరకు దరఖాస్తులు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
* ప్రాజెక్ట్ టెక్నీషియన్: 98
* జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 57
* వెల్ఫేర్ ఆఫీసర్: 03
* కన్సల్టెంట్(కోఆర్డినేషన్): 02
మొత్తం పోస్టుల సంఖ్య: 160
అర్హత: టెక్నీషియన్ పోస్టులకు టెన్త్‌తో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. కన్సల్టెంట్ పోస్టులకు ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ అర్హత ఉండాలి.
వేతనం: నెలకు టెక్నీషియన్‌కు రూ.20,000- రూ.65,000; వెల్ఫేర్ ఆఫీసర్‌కు రూ.40,000- రూ.1,40,000; జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.30,000- రూ.1,20,000; కన్సల్టెంట్‌కు రూ.1,00,000.
వయోపరిమితి: ప్రాజెక్ట్ టెక్నీషియన్‌కు 18 నుంచి 32 ఏళ్లు; జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 27 నుంచి 45 ఏళ్లు; వెల్ఫేర్ ఆఫీసర్‌కు 18 నుంచి 35 ఏళ్ల మధ్య; కన్సల్టెంట్‌కు 62 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 03.10.2026.
