అమెజాన్‌లో ఉద్యోగావకాశం: Associate – ML Data Operations | Work From Home Jobs 2025
అమెజాన్ కంపెనీలో పనిచేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాన్స్!
Amazon Robotics Fulfillment Centers కోసం డేటా ఆపరేషన్స్‌కు సంబంధించి కొత్త ఉద్యోగాలను ప్రకటించింది. ఇది Amazoon Work From Home, Rotational/Night Shifts, మరియు 6 నెలల కాంట్రాక్ట్ బేసిస్ మీద జరిగే జాబ్.
ఈ రోల్‌లో మీరు వీడియోలను గమనించాలి, ఉత్పత్తులు స్టోరేజ్ ప్రాంతాల్లో సరైన రీతిలో ఉంచబడాయా లేదా అనేది టూల్స్ ల ద్వారా చెక్ చేయాలి. ప్రతి రోజు వందల కొద్ది చిన్న వీడియోలు (15-20 సెకన్లపాటు) చూసి, అత్యధిక ఖచ్చితత్వంతో నిర్ణయాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇది ఒక నాన్-టెక్ ఆపరేషనల్ రోల్ అయినప్పటికీ, డిగ్రీ పూర్తి చేసినవారు, ధైర్యంగా స్క్రీన్‌పై ఫోకస్ చేయగలవారు, మరియు రాత్రి షిఫ్ట్స్‌లో పని చేయగలవారు తప్పకుండా అప్లై చేయవచ్చు. ఇంటర్వ్యూకు ముందు కొన్ని సాధన పరీక్షలు (assessment tasks) ఉండొచ్చు.
👉 పూర్తి సమాచారం కోసం, దయచేసి ఈ పూర్తి జాబ్ పోస్టు చదవండి. 👇
»ముఖ్యమైన వివరాలు :
🔹 పోస్ట్ పేరు: Associate – ML Data Operations
🔹 కంపెనీ: Amazon India
🔹 లోకేషన్: Work From Home
🔹 డ్యూమేషన్: 6 నెలల కాంట్రాక్ట్
🔹 అర్హతలు: డిగ్రీ, వీడియో చూసి సరైన తీర్పు చెప్పగలగాలి, అలాగే రాత్రిపూట పని చేయడానికి సిద్ధంగా ఉండాలి
🔹 జీతం & బెనిఫిట్స్: చక్కటి జీతం + రాత్రి షిఫ్ట్ అలవెన్స్ + పనితీరు మెరుగుపరిచే ట్రైనింగ్ (కోచింగ్) లభిస్తుంది
»ఈ ఉద్యోగంలో మీరు చేసే పని ఏంటి ?
ఈ ఉద్యోగంలో అసోసియేట్ రోజుకు వందల కొద్దీ చిన్న వీడియోలు (15–20 సెకన్లు) చూడాలి. వీటిని శ్రద్ధగా గమనించి, ఏమి జరుగుతోందో అర్థం చేసుకుని, టూల్ ద్వారా సరైన సమాధానం ఇవ్వాలి. పని చేసే విధానం మంచి ఖచ్చితత్వంతో (accuracy), వేగంగా (speed) మరియు అమెజాన్ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఉండాలి.
ఒక్కో రోజు మొత్తం 9 గంటల షిఫ్ట్ ఉంటుంది. అందులో ముందు నుంచి ఫిక్స్ చేసిన బ్రేక్‌లను తీసుకోవచ్చు. కానీ అసలు పని (వీడియో చూడటం, సమాధానాలు ఇవ్వడం) కనీసం 6.8 నుండి 7 గంటల వరకు చేయాలి. అంటే రోజుకు దాదాపు 7 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
ఇంటి నుండి పనిచేయాలనుకునే అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి:
-
పని చేయడానికి ప్రత్యేకమైన స్థలం అవసరం — టేబుల్, కుర్చీ, మరియు సరిపడిన వెలుతురు ఉండాలి.
-
ల్యాప్‌టాప్‌లో ఉండే డేటా/వీడియోలు ఇతర ఎవరూ చూడకూడదు. అది మీ బాధ్యతగా చూసుకోవాలి.
»ఈ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ?
ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థి కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు, పనితీరు చూపించగలగాలి. మొదటిగా, ఇది ఒక నాన్-టెక్ ఆపరేషనల్ జాబ్ కావడంతో, 6 నెలల కాంట్రాక్ట్ డ్యూరేషన్‌కి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అభ్యర్థి వీడియో, ఇమేజ్ లేదా టెక్స్ట్ ఆధారిత డేటా జాబ్స్‌ను పరిశీలించి సరైన సమాధానం ఇవ్వగలగాలి.
చాలా సందర్భాల్లో వీడియోలు స్పష్టంగా లేకపోవచ్చు (బ్లర్ లేదా డిమ్‌డ్ వీడియోలు). అలాంటప్పుడు కూడా స్క్రీన్‌పై పూర్తి శ్రద్ధతో గమనించి, వివరాలను గుర్తించే శక్తి ఉండాలి. అలాగే, quality మరియు productivity పై step-by-step targets మీద పని చేయడానికి ఆసక్తి ఉండాలి.
ఈ రోల్‌కి అవసరమైన ఇతర లక్షణాలు:
-
వేగంగా పని ప్రారంభించడం, అదే consistent గా కొనసాగించడం
-
Rotational మరియు Night Shifts లో పని చేయగలగడం
-
Remote Teams తో సమన్వయం చేసుకోగలడం, మంచి టీమ్ ప్లేయర్‌గా ఉండడం
-
Work From Home చేస్తూ ,అమెజాన్ మీకు చెబితే, మీరు ఒక-రెండు రోజులు ఆఫీస్‌కి వెళ్లి అక్కడి నుంచే పని చేయాలి. ఇది తరచుగా కాదు, కానీ అవసరం వచ్చినపుడు మాత్రమే
-
Online సమావేశాల్లో ల్యాప్‌టాప్ కెమెరా ఆన్ చేయడానికి సిద్ధంగా ఉండాలి
»Amazon రోజు మొత్తం పని ఎలా ఉంటుంది?
- ఈ ఉద్యోగం 24×7 వర్క్ ఎన్విరాన్‌మెంట్ లో ఉంటుంది, అంటే రాత్రింబవళ్లు శిఫ్ట్‌లు ఉండే అవకాశం ఉంటుంది. అసోసియేట్ రోజుకు 9 గంటల షిఫ్ట్ లో పనిచేస్తారు — ఇందులో ముందే నిర్ణయించిన బ్రేక్‌లు కూడా ఉంటాయి.
- షిఫ్ట్ టైమింగ్‌లు ప్రతి 3-4 నెలలకు ఒకసారి మారవచ్చు, లేక కంపెనీ అవసరాన్ని బట్టి కూడా మారే అవకాశం ఉంది. అభ్యర్థి నైట్ షిఫ్ట్ లో పని చేస్తే, అమెజాన్ పాలసీ ప్రకారం నైట్ షిఫ్ట్ అలవెన్స్ (extra money) కూడా ఇస్తారు.
- ప్రతి వారం 5 రోజులు పని, 2 రోజులు వరుసగా సెలవులు ఉంటాయి. అయితే ఈ సెలవులు Saturday–Sunday తప్పనిసరి కాదు — షెడ్యూల్ బట్టి రొటేషన్ లో ఉండవచ్చు
»ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు?
✅ కనీస అర్హత (Basic Qualification):
-
అభ్యర్థి తప్పనిసరిగా బ్యాచిలర్స్ డిగ్రీ (Bachelor’s Degree) పూర్తిచేసి ఉండాలి.
👍 ఇష్టపడే అర్హతలు (Preferred Qualification):
-
ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ లో పని చేయగలగాలి — వీకెండ్స్, రాత్రి షిఫ్ట్‌లు లేదా సెలవుల సమయంలో కూడా అవసరమైతే పనిచేయాలి.
-
షిఫ్ట్‌లు, పని ప్రాంతం మారితే కూడా ఐటీవల్ని అడ్జస్ట్ చేసుకోగలగాలి.
💡 స్పెషల్ నోట్:
అమెజాన్ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాల కల్పన ఉంటుంది. మీరు దివ్యాంగత (disability)తో ఉన్నా లేదా ప్రత్యేక సహాయం అవసరం అయినా, అప్లికేషన్ లేదా ఇంటర్వ్యూ సమయంలో అవసరమైన సపోర్ట్ అమెజాన్ అందిస్తుంది.
మరిన్ని వివరాల కోసం:
🔗 https://amazon.jobs/content/en/how-we-hire/accommodations
జాబ్‌కు అప్లై చెయ్యడానికి సంబంధించిన (direct) లింక్